Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu
WELCOME TO BASHEERABADBlogger Tips and Tricks
రాజకీయాలు

గ్రామ సర్పంచ్  మరియు పదవికాలం

       బషీరాబాద్ రాజకీయ చైతన్యంగా ఎదిగిన గ్రామం. దొరల పాలన అంతమైన పిదప ఈ గ్రామాన్ని యువకులే పరిపాలిస్తున్నారు. గ్రామంలో యువతను చైతన్య పరచడంలో నవోదయ యువజన సంఘం ముందుంది. ఈ సంఘం చైతన్య దీపికలైన కీ||శే||డా.మోతిరాం సర్పంచ్ పదవి నిర్వహించగా,పడకంటిరాజశేఖర్ రాజకీయాల్లో కొనసాగుతున్నాడు.తుక్కడి నారాయణ,  కందుకాల సురేష్,మంద చౌదరి,ఆంకడి గంగారాం,కస్తూరి గంగారాం,నీల రాజేశ్వర్,బొమ్మ గంగారాం(రిటైర్డ్ హెడ్ మాస్టర్),మేర గట్ల భూమేశ్వర్, సంఘ సభ్యులే. మాజీ సర్పంచ్ గా సక్కరాం అశోక్ గారు చేశారు. గ్రామ రాజకీయాలలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్న నీరడిసాయన్న,ఏనుగు గంగా రెడ్డి లు ఈ సంఘం చైతన్య దీపికలే.భీమ్ గల్ తాలుకా కేంద్రానికి మొట్టమొదటి పాత్రికేయుడుగా తుక్కడి నారాయణ,పడాల కృష్ణ మోహనరావులు గ్రామాభివృద్ది కోసమై నిర్మాణాత్మక సహయ సహకారాలు అందించిన వీరుకూడ ఈ సంఘం చైతన్యదీపికలే నవోదయ యువజన సంఘం గ్రామం లో గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేశారు.రెండు సంఘాల అధ్వర్యంలో సంయుక్తంగా గ్రంథాలయాన్ని నిర్వహిం చారు.నవోదయ యువజన సంఘం పాఠశాల అదనపు గదుల నిర్మాణం,గ్రామంలోని రోడ్లను వెడల్పు చేయించడంలో కృషి సల్పుతూ శ్రమదానం చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి యువజన సంఘం వ్యవస్తాపకులు డా.పడాల జగన్మోహనరావు,డా.విశ్వనాథంలు,కొండ ఆశన్న,పి.రామరావులు గ్రామ అభివృద్ధి లో నిర్మాణాత్మక సహకారం అందించిన వారే.జగుడం గుండయ్య.పిట్ట్ల శంకర్.సర్పంచు లు గా సోదరద్వయం కీ||శే||సక్కరాం నారాయణ ,సక్కరాం చిన్నయ్యలు,నేల్ల బక్కన్న,  డా"లక్ష్మినర్సయ్య,కీ||శే||పడకంటి ముత్తెన్న,కీ||శే||తుక్కడి కర్రెన్న,కీ||శే||వీరాగౌడ్, పార్వతి చిన్న రాజన్న, గుర్రపు ఎల్లప్ప,జక్కంరాజన్న, డబ్బా గంగారాం,వాచార్ పోశన్న,మోతె ముత్తన్న,  మొదలగువారంతా గ్రామ అభివృద్ధి లో చురుకైన పాత్ర వహించినవారే.ఉపాధ్యాయులు వి.శంకర్,అల్లకొండ పోగుల లింగన్న,రత్నపురం లింగన్న,కస్తూరి పెద్ద గంగారంలు ఆధ్యాత్మిక సంపదను పంచుతున్నారు.గ్రామాభివృద్దిలో మహిళల పాత్ర కూడ చురుకైనదే.శ్రీ విజయ లక్ష్మి వెంకన్న సర్పంచ్ గా ఎన్నికై గ్రామాభివృద్దికి పాటు పడ్డారు. మొట్టమొదటి బాల్వాడి పాఠశాల నిర్వహించిన కీ||శే||జె.ముత్తుబాయి కూడా అభినందయురాలే.గ్రామంలో అనేక స్వయం సహాయక మహిళ గ్రూపులు పనిచేస్తూ గ్రామాభివృద్దికి పాటు పడుతున్నాయి.మండలాలుగా ఏర్పడినప్పటి నుండి మా గ్రామానికి చెందినవారే కమ్మర్ పల్లి మండలాన్ని పరిపాలిస్తున్నారు. మొట్టమొదటి మండల అధ్యక్షుడు గోపు వేంకట బాస్కరరావు బషీరాబాద్ కు చెందినవాడే,ఇదే గ్రామానికి చెందిన గోపి కిషన్ గోపుదేవదాసు మండలాధ్యక్షులుగా ఎన్నికై ఐదేళ్లు పరిపాలించారు. పొరుగునున్నచౌట్ పల్లి గ్రామానికి చెందిన ఏలేటి మహిపాల్ రెడ్డి,మాజి అసేంబ్లీ స్పీకర్ శ్రీ.కె.ఆర్.సురేష్ రెడ్డి సహయ సహకారంతో గ్రామం దినదిన అభివృద్ధిచెందింది. మంత్రిత్వశాఖలున్నట్లుగా ఈ గ్రామ అభివృద్ధి  కమిటి కి అధ్యక్షులు,కార్యదర్శుల సమక్షంలో సభ్యులకు ఎవరి శాఖలు వారికి కేటాయించగా వారు గ్రామ అభివృద్ధికి  పాటుపడుతున్నారు.ఈ కమిటి ప్రతి యేటా కొత్తగా ఏర్పడుతుంది.గ్రామంలో అక్షరాశ్యత శాతం పెంపొందుతూ ఇక్కడ చదువుకున్నవారిలో చాలామంది ఉపాధ్యాయులు,గ్రాడ్యుయేట్లు,డాక్టర్లు,ఇంజనీర్లు కూడ ఉన్నారు.ఈ గ్రామం నుండి మొట్ట మొదటి ప్రభుత్వ ఉద్యోగులుగా తుక్కడి రాజన్న,  కీ||శే||సక్కరాం నారాయణ తమ సేవలను అందించారు.తుక్కడి రాజన్న ఇంజనీరు గా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో పాలు పంచుకున్నారు.  గ్రామానికి చెందిన పోలిసు రమేష్ గల్ప్ దేశాల్లో స్వంత కంపేని నిర్వహిస్తు ,గ్రామ యువతకు ఉపాధి కల్పిస్తున్నారు.