Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu
WELCOME TO BASHEERABADBlogger Tips and Tricks
అలయాలు,అధ్యాత్మిక గ్రామం


శ్రీవేంకటేశ్వర ఆలయం


                పాత గుడి                          శ్రీవారి మొట్లు          నూతన ఆలయం             గంగమ్మ ఆలయం


           ఈ గ్రామం అధ్యాత్మికంగా , భక్తి పారవశ్యంతో అలరారుతుంది. ఈ గ్రామం నడిబొడ్డున వేణు గోపాలస్వామి ఆలయం, గ్రామం పడమర దిక్కున "శ్రీ అంజనేయ స్వామి" మరియు "మహదేవుడు" ఆలయాలున్నాయి. ఇక్కడ కొలువై ఉన్న గ్రామదేవత ముత్యాలమ్మ చుట్టు ప్రక్కల గ్రామలవారి పూజలు అందుకుంటు అలరారుతుంది.బొంబాయి,మహరాష్ట్ర ప్రాంతాలనుండి వచ్చి ఈ అమ్మవారిని కొలుస్తుంటారు.ఈ గుడిలో అఖండజ్యోతి ఏప్పుడు వెలుగుతూ ఉంటుంది. గ్రామానికి వాయువ్య దిశలో 2 కి.మీ దూరంలో మర్రిచెట్టులో కలిపిన అమ్మవారు దుర్గమాత శుక్రవారం దేవతగా అలరారుతుంది.ప్రతి శుక్రవారం భక్తులు తమ మొక్కులు చేల్లించుకుంటారు.వసంత పంచమి రోజున జాతర జరుగుతుంది. గ్రామానికి ఉత్తరం దిశన సుమారు కోటి డెబ్భై లక్షలతో షిరిడి సాయిబాబా మందిరం 40 అడుగులతో పంచముఖి హన్మంతుని విగ్రహం నెలకొల్పబడుతుంది. యన్.ఆర్.ఐ. పోలీసు రమేష్ తన డబ్బుతో స్వయంగా ఈ ఆలయ ప్రాంగణంను నిర్మిస్తున్నారు.
 ఇక్కడే ముదిరాజ్ అరాధ్య దైవమైన పెద్దమ్మ అలయం ఉంది. గ్రామానికి దక్షిణంగా గుట్టపై పురాతనమైన వేంకటేశ్వరుని ఆలయం కూడ ఉంది.ఇటీవల ఈ ఆలయాన్ని అందంగా పున:నిర్మించారు.భీమ్‌గల్ మార్గంలో బండ్రేవులో రేణుక దేవి(ఏల్లమ్మ)ఆలయం కూడ కలదు.ఇంకా గ్రామానికి తూర్పున గ్రామదేవతలుచిల్కలచిన్నవ్వ,మహలక్ష్మి అమ్మవారు,  తాతాయి గుడులు  కలవు.  ఇంకా అంజనేయ స్వామి,లక్ష్మి నరసింహ స్వామి,పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మున్నగు ఆలయాలు ఉన్నాయి.ఈ గ్రామంలో సుందర సత్సంగం,స్వాధాయ,భజన మండలి వంటి అధ్యాత్మిక సంఘాలు ఉన్నాయి.ఈ గ్రామాన్ని తరచు శ్రీ సుందర చైతన్యనందస్వామి,హంపి పిఠాధిపతి శ్రీ విద్యారణ్యభారతి స్వామి,శ్రీ త్రిందండి చిన్నజీయర్ స్వామి వార్లు సందర్శిస్తుంటారు.ఈ గ్రామంలో నవరాత్రి దసర ఉత్సవాలు బ్రహ్మండంగా జరుగుతాయి.దేశ,విదేశాలలో ఉంటున్న గ్రామస్తులు దసర ఉత్సవాలకు సెలవు పై తప్పనిసరిగా వస్తుంటారు.
విశేషం:గ్రామంలో నాలుగైదు కుటుంబాలు మాత్రమే ముస్లీం కుటుంబాలున్నాయి గాని గ్రామాన్ని "బషీరాబాద్"గా పిలుస్తుండం విశేషం.ఈ నాలుగైదు కుటుంబాలను గ్రామ ప్రజలు అక్కున చేర్చుకోని మతసామరస్యం చాటుతున్నారు.గ్రామంలో మొహర్రం(పీర్ల పండుగ)పండుగ "అసైదుల హరతి కాళ్ళగజ్జలగమ్మతి" అంటూ ముదిరాజ్(తెనుగు),మున్నూరు కాపు కులాల వారు ధూం ధాంగా జరుపుతారు.  కొందరు గ్రామస్థులో మొక్కులు ఉన్నవారు ధూలగుట్ట వద్ద వున్న బషీర్ సాముల దర్గా వద్ద మరియు కాడిచెరువు వద్ద గల పెద్దగుట్ట దర్గా వద్ద కందూర్,చిన్నపిల్లలకు పుట్టువెంట్రుకలు మరియు ఇతర మొక్కులు చెల్లించుకుంటారు.ముస్లీం కోసం ప్రత్యేకంగా మజీద్ నిర్మించి ఇచ్చారు.