Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu
WELCOME TO BASHEERABADBlogger Tips and Tricks

చరిత్ర

   బషీరాబాద్ గ్రామమును పూర్వం వెంకటాపురం అని పిలిచేవారు. ప్రస్తుతం ఉన్న కాడీచెరువు ప్రాంతంలోని లంబడ దుబ్బ ప్రాంతంలో వెంకటాపురం గ్రామం ఉండేది. ఈ ప్రాంతంలో దట్టమయిన అడవి, క్రూరమయిన జంతువులతో ఈ ప్రాంతం నిండుకొని ఉండేది. నైజాం నవాబుల కాలంలో సురక్షిత ప్రదేశానికి ప్రస్తుతం ఉన్న ప్రాంతానికి తరలించారు. ఈ గ్రామాన్ని బషీర్ అహ్మద్ పరిపాలించేవాడు. ఇతను మరణించడంతో వెంకటాపురం గ్రామాన్ని 'బషీరాబాద్' గా నామకరణం చేశారు.
బషీర్ ఆహ్మద్ సమాధి దూలగుట్ట వెనుక భాగంలో చింతల్ చెరువు కట్ట ప్రారంభంలో ఉన్నది. ఈ సమాధిని 'బషీర్ సాములు' అంటారు. అభిమానులు కొందరు ఇప్పటికీ ఈ సమాధి వద్ద ప్రతి శుక్రవారం పూజలు నిర్వహిస్తుంటారు. ఈ గ్రామాన్ని తదుపరి కాలంలో వలస వాదులయిన ఎల్లాపు దొరలు పరిపాలించారు. భూస్వాములుగా గోపు చొక్కారావు, గోపు జీవన్ రావులు మరియు గోపు వెంకట భాస్కరరావులు ఈ గ్రామాన్ని పరిపాలించారు. ఈ గ్రామస్తులు ఎల్లాపు దొరల భూస్వామ్య పోకడలను ఎదురించడంతో వీరి పరిపాలన అంతరించింది.రెవేన్యూ రికార్డుల్లో కొంతభూభాగాన్ని "వెంకటాపురం"గానే వ్యవహరిస్తున్నారు. గ్రామస్తులంతా ఈ గ్రామాన్ని "వెంకటాపురం"గానె మర్చాలని డిమాండ్ చేస్తున్నారు.