Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu
WELCOME TO BASHEERABADBlogger Tips and Tricks
ప్రకృతి ఓడిలో గ్రామం



                గ్రామం చుట్టూరా పసుపు, సోయా, మొక్కజొన్న, జొన్న, వరి పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలంగా అగుపిస్తుంది. గ్రామం చుట్టూరా టేకు, శనంగి,మోదుగ, మద్ది, ఈత చెట్లతో కూడిన సుందరమైన వనంతో కూడిన కొండలు అలరిస్తుంటాయి. ఒర్రెల ద్వార పారె నీటీని ఆపడానికి 4 చెక్ డ్యాములు ఉపాధి హామీ పథకములో నిర్మించారు. కొండల మధ్య కాడి చెరువు జలాశయం సరోవరం లాగా సుందరంగా అగుపిస్తుంటుంది.ఇక్కడగంగమ్మతల్లిగుడిఉంది.సంచరించేనెమళ్లు,కుందేలు,చూపరులనుమంత్రముగ్దుల్నిచేస్తాయి.ఇంకావనంలోఅడవిపందులు, కొండగొర్రెలు,లేళ్లు,దుప్పలు,ఎలుగుబంటులు,చిరుతపులులుకూడ సంచరిస్తుంటాయి. ఇక్కడి అడవిని గ్రామభివృద్ది కమిటి రక్షిస్తుంది.ఈ ప్రాంతాన్ని అభివృద్ధి  పరిస్తే మంచి పర్యాటక కేంద్రంగా తయారవుతుంది.ఈ కాడిచెరువులో బోటింగ్ షికారు,ఉద్యానవనం,పిల్లల పార్కు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.